![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం శనివారం నాటి ఎపిసోడ్ -1100 లో... ఐశ్వర్య గురించి ఇందు ఆలోచిస్తుంది. ఐషు అంటే నాకు చాలా ఇష్టం రాజు కానీ అది నేను చెప్పినట్లు వినడం లేదని చెప్తూ బాధపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు నిద్రపోతారు. అప్పుడే అటుగా అపర్ణ వెళ్తుంది. ఇందు నేలపై రాజు బెడ్ పై పడుకోవడం చూసి షాక్ అవుతుంది. అపర్ణ తన గదిలోకి వెళ్లి ఐశ్వర్య అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది.
ఏమైందని సుభాష్ అడుగుతాడు. నాకు ఎందుకీ ఐశ్వర్య అన్న మాటలు నిజమనిపిస్తుంది. రాజు, ఇందు పెళ్లి చేసుకోలేదనిపిస్తుందని అపర్ణ అనగానే తనేదో అంటే అదే నిజమని అనుకుంటావా అని సుభాష్ అంటాడు. వాళ్ళ పెళ్లి జరిగిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం.. వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని అపర్ణ చెప్తుంది. మరొకవైపు వెంకీని కలవడానికి నందు వస్తుంది. తనని చూసి ఇంట్లోకి వెళ్లి.. అమ్మ నందు వస్తుంది నేను లేనని చెప్పమని అంటాడు. వెంకీ లోపలికి వెళ్తాడు. నందు వచ్చి ఆంటీ వెంకీ ఎక్కడ అని అడుగుతుంది. బయటకు వెళ్ళాడని లక్ష్మీ చెప్తుంది. మరి బండి ఉందని నందు అనగానే ఏమో అమ్మ వాడు అయితే బయటకు వెళ్ళాడని లక్ష్మీ చెప్తుంది. వచ్చాక కాల్ చెయ్యమని చెప్పండి అని నందు వెళ్తుంది. వెంకీ బయటకు వస్తాడు. అసలు ఏం జరుగుతుందిరా మీ మధ్య అని లక్ష్మీ అడుగుతుంది. నేను తనని ప్రేమిస్తున్నా అమ్మ అని వెంకీ ఎమోషనల్ అవుతాడు. తను ఆ ఇంటికి వారసురాలు అని తెలిసాక మర్చిపోవాలని ట్రై చేస్తున్నానని వెంకీ అంటాడు. మరొకవైపు ఇందుతో అపర్ణ వ్రతం గురించి మాట్లాడుతుంది. నాకు తెలియకుండా ఎందుకు ఫిక్స్ చేసావని ఇందు అడుగుతుంది. నేను వెళ్లి గుళ్లో అన్ని ఏర్పాట్లు చేస్తాను.. నువ్వు రాజుని తీసుకొని రా అని అపర్ణ చెప్తుంది. అదంతా పైనుండి భ్రమరాంబ శేషు వింటారు.
ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు భార్యాభర్తలు అవునో కాదో అని అనుకుంటారు. ఆ తర్వాత రాజు దగ్గరికి ఇందు వెళ్లి వ్రతం గురించి చెప్తుంది. అది పెళ్లి అయిన వాళ్ళు చేస్తారు. మనం కాదు.. నేను దేవుడు విషయంలో మోసం చెయ్యను.. నేను అయితే పూజకి రానని రాజు చెప్తాడు. మరొకవైపు భ్రమరాంబ, శేషు గుడికి బయల్దేరతారు. తరువాయి భాగంలో ఇందు ఒక్కతే గుడికి వస్తుంది. నిజం చెప్పు అసలు మీరు భార్యాభర్తలు కాదు కదా.. నా మీద ఒట్టేసి నిజం చెప్పమని అపర్ణ అనగానే ఇందు నిజం చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |